విస్తారా విమానాల్లో ఏమి ఉందో కానీ తేనేటీగలు మాత్రం వాటి మీదే పడుతున్నాయి. కోల్ కతా విమానాశ్రయంలో రెండు విస్తారా విమానాలు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఈ కారణంగా విమాన సర్వీసుల్లో ఒకింత జాప్యం చోటుచేసుకుంది. తాజాగా వరసగా రెండు రోజులు విస్తారా విమానాలకే ఇలా జరగటం విశేషం. ఈ తేనేటీగల గుంపులను చెదరగొట్టేందుకు ఏకంగా వాటర్ క్యానన్ లను ఉపయోగించాల్సి వచ్చింది. ప్రయాణికులు విమానం ఎక్కక ముందే సిబ్బంది వీటిని గుర్తించారు.
నిపుణులతో కూడిన ఆయా విమానాలను సందర్శించి...ఎక్కడైతే తేనేటీగలు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా మందు చల్లి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తర్వాత విమానాలు సాధారణంగా సర్వీసులకు బయలుదేరి వెళ్ళాయి. 2019లో ఓ సారి ఎయిర్ ఇండియా విమానానికి కూడా కోల్ కతా విమానాశ్రయంలో ఇదే పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు.