దేశంలోని ప్రముఖ టెలికం ఆపరేటర్లలో ఒకటైన విఐ తన వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో 60 మిలియన్ల మంది అల్పాదాయ వినియోగదారులకు ఈ ప్యాకేజీ అందిస్తున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా మహమ్మారి రెండవ వేవ్లో అన్ని సమయాల్లోనూ కనెక్ట్ అయ్యేందుకు తోడ్పడనుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్లో భాగంగా 60 మిలియన్ల మంది అల్పాదాయ వినియోగదారులకు ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 49 రూపాయల ప్యాక్ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్యాక్లో భాగంగా 38 రూపాయల టాక్టైమ్, 100 ఎంబీ డాటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది.
ప్రత్యేకంగా అందిస్తోన్న ఈ ఒన్ టైమ్ ఆఫర్తో, వీఐఎల్ ఇప్పుడు 2,940 మిలియన్ రూపాయల విలువ కలిగిన ప్రయోజనాలను దేశంలో అల్పాదాయక వర్గాల వినియోగదారులకు అందిస్తుంది. అదనంగా, వి ఇప్పుడు నూతన కాంబో ఓచర్ను 79 రూపాయల రీచార్జ్తో అందిస్తుంది. ఇది అత్యధిక సంఖ్యలో ప్రజలకు భారీ ప్రయోజనాలను కలిగించనుంది. ఈ ప్రత్యేక రీచార్జ్తో రెట్టింపు టాక్టైమ్ 128 రూపాయలు (64 +64) మరియు 200 ఎంబీ డాటా 28 రోజుల వ్యాలిడిటీతో పరిమిత కాలం పాటు లభ్యమవుతుందని తెలిపింది.