ఈ ఎంట్రీ టిక్కెట్ ధర గరిష్టంగా 823 రూపాయల వరకూ ఉంటుందని అంచనా. సందర్శకులు పెరిగే కొద్దీ టిక్కెట్ రేటు కూడా పెరుగుతూపోతుంది. వెనిస్ సిటీ గత కొన్ని సంవత్సరాలుగా ఓవర్ టూరిజంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి అక్కడే హోటళ్ళలో బస చేసే పర్యాటకులకు ఎలాంటి టిక్కెట్ ఉండదు. ఎవరైనా పర్యాటకులు ఎంట్రీ టిక్కెట్ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం భారీగా జరిమానాలు విధించనున్నారు. అయితే అక్కడి వరకూ వెళ్లిన వారికి ఎంట్రీ టిక్కెట్ భారం అవుతుందా?.