కరోనా తర్వాత అమెరికా వీసాలు పొందటం గగనం గా మారింది. ముఖ్యంగా అగ్రరాజ్యంలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ కు చెందిన విద్యార్థులు కూడా చెన్నయ్, ఢిల్లీ, ముంబైలో స్లాట్లు దక్కించుకొని వీసాలు పొందారు. విద్యార్థులు ఇన్ని ఇబ్బందులు పడటం ఒకెత్తు అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో అమెరికా భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసినట్లు చెపుతోంది. 2022 సంవత్సరంలో భారత విద్యార్థులకు ఏకంగా 1 .25 లక్షల వీసాలు జారీ చేశారు. ఈ విషయాన్ని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రదినిది నెడ్ ప్రైస్ వెల్లడించారు.. ఇది అల్ టైం హై అని తెలిపారు.
అదే సమయంలో ఇంకా కూడా వీసా ఇంటర్వ్యూ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా సకాలంలో వీసా ప్రాసెస్ చేయటం ఎంతో కీలకం అని తెలిపారు. అయితే పర్యాటకులకు వీసా ల మంజూరులో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే అన్నారు. దీన్నికూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కీలక పని కోసం సిబ్బందిని రెట్టింపు చేశామన్నారు. గత కొన్ని నెలలుగా అమెరికా వీసా పొందటం అంటే అదో పెద్ద సంచలనంగా మారింది.