ఆగ‌స్టు 1 వ‌ర‌కూ భార‌త విమానాల‌పై యూఈఏ నిషేధం

Update: 2021-07-21 08:28 GMT

యునైటెడ్ అర‌బ్ ఏమిరేట్స్ (యూఏఈ) మ‌రోసారి భార‌త్ నుంచి విమానాల‌పై నిషేధాన్ని పొడిగించింది. తాజాగా ఇచ్చిన ఆదేశాల మేర‌కు ఆగ‌స్టు 1 వ‌ర‌కూ భార‌త్ నుంచి ఎలాంటి విమానాల‌ను అనుమ‌తించ‌రు. భార‌త్ తో పాటు శ్రీలంక‌, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ల విమానాల‌కు ఈ నిషేధం వర్తించ‌నుంది. అన్ని ర‌కాల వీసాల‌కు ఇది అమ‌ల్లో ఉండ‌నుంది. యూఏఈ జ‌న‌ర‌ల్ సివిల్ ఏవియేష‌న్ అథారిటీ ఏప్రిల్ 24 నుంచి భార‌త విమానాల‌పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.

ఎతిహాద్ ఎయిర్ లైన్స్ అయితే జులై31 వ‌ర‌కూ అయితే విమానాల‌ను న‌డ‌ప‌నున్నట్లు ప్ర‌క‌టించింది. కొత్త తేదీపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే కొన్ని ఎయిర్ లైన్స్ మాత్రం నాన్ రిఫండ‌బుల్ ప‌ద్ద‌తి ప్ర‌కారం టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తున్నాయి. క‌రోనా రెండ‌వ ద‌శ కార‌ణంగా ప‌లు దేశాలు భార‌త విమానాల‌ను అనుమ‌తించ‌టం లేదు.

Tags:    

Similar News