ఇద్ద‌రు పైల‌ట్లు నిద్ర‌పోయారు..ల్యాండింగ్ కూడా మ‌ర్చిపోయారు

Update: 2022-08-19 12:22 GMT

Full Viewషాకింగ్ న్యూస్. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ లో సంచ‌ల‌న సంఘ‌ట‌న జ‌రిగింది. విమానంలోని ఇద్ద‌రు పైల‌ట్లు ప్లైట్ ను ఆటోమోడ్ లో పెట్టేసి నిద్ర‌పోయారు. విమానం ల్యాండ్ అవ్వాల్సిన ప్ర‌దేశం వ‌చ్చినా కూడా వాళ్లు మేల్కొన‌లేదు. అప్పటికీ విమానం ఇంకా 37 వేల అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తోంది. సూడాన్ నుంచి ఇథియోఫియా వ‌స్తున్న విమానంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

దిగాల్సిన ప్రాంతం కంటే ఈ విమానం ఎక్కువ దూరం ప్ర‌యాణిస్తుండ‌టంతో ఏటీసీ సిబ్బంది కూడా పైల‌ట్ల‌ను కాంటాక్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ స‌మ‌యంలోనే ఆటోపైల‌ట్ డిస్ క‌నెక్ట్ అయి అలారం మోగ‌టంతో వీరు మేల్కొన్నారని ఏవియేష‌న్ హెరాల్డ్ వెల్ల‌డించింది. అలారం మోగిన త‌ర్వాత నిద్ర‌లేచిన పైల‌ట్లు ఇద్ద‌రూ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయ‌టంతో ప్ర‌యాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది. 

Tags:    

Similar News