దేశంలోని పది ఆగ్రశ్రేణి కంపెనీల జాబితా విడుదలైంది. అందులో ప్రముఖ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంస్థ మొత్తం విలువను 18, 87,881 కోట్ల రూపాయలుగా లెక్కించారు. రిలయన్స్ తర్వాత స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉంది. ఈ సంస్థ విలువను 12,97,756 కోట్ల రూపాయలుగా తేల్చారు. హురున్ ఇండియా ఈ జాబితాను సిద్ధం చేసింది.
రిలయన్స్, టీసీఎస్ ల తర్వాత హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఇన్పోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ గ్రీన్ ఎనర్జీ, భారతి ఎయిర్ టెల్, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు లు ఉన్నాయి. దేశంలో టాప్ టెన్ కంపెనీల్లో ఆరు ముంబయ్ ప్రధాన కేంద్రంగా ఉండటం విశేషం. ఈ పది కంపెనీల మొత్తం విలువ భారత జీడీపీలో37 శాతంగా ఉంటుందని తెలిపారు.మొత్తం మీద వీటి నికర విలువను 71.8 లక్షల కోట్ల రూపాయలుగా లెక్కించారు.