Full Viewఅత్యంత ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని వంద అగ్రశ్రేణి కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిస్ ఒక్కదానికి మాత్రమే చోటు దక్కింది. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ 64 స్థానంలో ఉంది. ఇన్ఫోసిస్ కు మొత్తం మీద స్కోర్ 88 .38 రాగా, ఉద్యోగుల సంతృప్తి విషయంలో ఈ కంపెనీ ర్యాంక్ 103 గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 750 బెస్ట్ కంపెనీల జాబితాలో మాత్రం విప్రో (174 ర్యాంక్), మహీంద్రా గ్రూప్ (210 ర్యాంక్), రిలయన్స్ ఇండస్ట్రీస్ (248 ర్యాంక్), హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ (262 ర్యాంక్), హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు (418 ర్యాంక్), డబ్ల్యూ ఎన్ ఎస్ గ్లోబల్ సర్వీసెస్ (596 ర్యాంక్), ఐటిసి లిమిటెడ్ (672 ర్యాంక్) లు దక్కించుకున్నాయి.
ఇదిలా ఉంటే ప్రపంచం లోని టాప్ టెన్ కంపెనీల జాబితాలో ఏడు కంపెనీలు అమెరికా కు చెందిన వే ఉండటం విశేషం. టైమ్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలో నంబర్ వన్ కంపెనీగా మైక్రో సాఫ్ట్ నిలిస్తే రెండవ స్థానంలో యాపిల్, మూడవ ప్లేస్ లో ఆల్ఫాబెట్, మెటా ప్లాట్ ఫార్మ్స్ నాల్గవ ప్లేస్ లో, యాక్సెంచర్, ఫైజర్, అమెరికన్ ఎక్స్ ప్రెస్ , ఎలెక్ట్రిసైట్ డి ఫ్రాన్స్, బిఎండబ్ల్యూగ్రూప్, డెల్ టెక్నాలజీస్ లు ఉన్నాయి. యాక్సెంచర్ ఐర్లాండ్ కంపెనీ అయితే..ఎలెక్ట్రిసైట్ డి ఫ్రాన్స్ ఫ్రాన్స్ కంపెనీ...బిఎండబ్ల్యూగ్రూప్ జర్మనీ కంపెనీ.