వేల ఐఫోన్లు చోరీ

Update: 2020-12-14 11:46 GMT

ఐఫోన్. దానికుండే క్రేజ్ అందరికీ తెలిసిందే. అలాంటి ఐఫోన్లు ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా వేల ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఏకంగా కంపెనీకి 440 కోట్ల రూపాయల మేర నష్టానికి కారణం అయ్యాయి. ఇది అంతా కర్ణాటక ఐఫోన్ ప్లాంట్ లో జరిగింది. జీతాలు సరిగా ఇవ్వటంలేదనే కారణంతో ఉద్యోగులు కంపెనీ యూనిట్ పై దాడికి దిగారు. ఆ సమయంలోనే ఫోన్లను కూడా కొంత మంది చోరీ చేశారు. ఇదే అంశంపై కంపెనీ పోలీసులతోపాటు కార్మిక శాఖకు కూడా ఫిర్యాదు చేసింది.

నాలుగు నెలలుగా వేతనాలు సరిగా ఇవ్వటంలేదనే కారణంతో ఉద్యోగులు కంపెనీ యూనిట్ పై ఇటీవలో కర్ణాటకలోని కోలార్ విస్టోర్న్ తయారీ యూనిట్ పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బెంగుళూరులోని 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న విస్ట్రోర్న్ కార్పొరేషన్ లోని కార్లు, ఇతర ఫర్నీచర్లు, ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News