టెస్లా లో పనిచేస్తూ ఇదేమి పని బాబులూ !

Update: 2024-07-13 13:25 GMT

Full Viewటెస్లా. ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడు ఎలాన్ మస్క్ కంపెనీ అన్న విషయం తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ కార్లు కూడా ఎంతో పాపులర్. అసలు విషయం ఏమిటి అంటే జర్మనీలోని టెస్లా కార్ల ఫ్యాక్టరీ లో ఏకంగా 65 వేల కాఫీ మగ్స్ మాయం అయ్యాయి అట. ఉద్యోగుల సమావేశంలో ఫ్యాక్టరీ మేనేజర్ ఆండ్రీ తీరిగ్ వెల్లడించారు. ఈ యూనిట్ లో టెస్లా కార్ల ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి 65 వేల కాఫీ మగ్స్ కొనుగోలు చేశాం. లెక్కల ప్రకారమే నేను ఈ మాట చెపుతున్నా.

                                                                        ప్రతి ఒక్క ఉద్యోగి ఇంట్లో ఇప్పుడు ఐదు ఐకియా కాఫీ కప్స్ ఉండి ఉంటాయి. అదనపు కాఫీ మగ్స్ కొనుగోలు ఆర్డర్స్ పై సంతకాలు పెట్టలేక అలిసిపోతున్నాను అంటూ ఆ మేనేజర్ చేసిన కామెంట్స్ పెద్ద సంచలనంగా మారాయి. ఈ వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇంత పెద్ద కంపెనీలో పని చేస్తూ చివరకు కాఫీ కప్ లు కొట్టేయటం ఏమిటి అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News