ఈ లెక్కన లిస్టింగ్ ధర ప్రకారం చూస్తే తొలి రోజే ఒక్కో షేర్ పై ఇన్వెస్టర్లకు 700 రూపాయలు లాభం వచ్చినట్లు. రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఒక కంపెనీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ పై పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. అందుకు అనుగుణంగానే వాళ్లకు తొలి రోజే లాభాల పంట పండింది అనే చెప్పాలి. లిస్ట్ అయిన తొలి రోజు బీఎస్ఈ లో ఈ షేర్ ధర ఒక దశలో రికార్డు 1400 రూపాయలకు చేరింది. గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బీఎస్ఈ లో ఈ షేర్లు 1343 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఈ కంపెనీ షేర్లు అలాట్ అయిన వారు ఫుల్ ఖుషీగా ఉన్నారనే చెప్పొచ్చు. ఈ ఏడాది భారతీయ స్టాక్ మార్కెట్ కూడా కొత్త కొత్త రికార్డు లు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.