ఓటీటీలకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటీటీల్లో కంటెంట్ నియంత్రణకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు ఏంటో తమకు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒరిజినల్స్ పేరుతో వస్తున్న కంటెంట్‌లో పోర్న్, క్రైమ్‌కు సంబంధించిన మోతాదు ఎక్కువగా ఉంటోందని, ఈ కంటెంట్ సెల్‌ఫోన్, టీవీల్లో అందరికీ అందుబాటులో ఉండడంతో చిన్న పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
'ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వచ్చే కంటెంట్ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వాటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటీటీలోని కొన్ని కార్యక్రమాల్లో పోర్నోగ్రఫీ ఉంటోందని, కంటెంట్‌ను ముందే స్క్రీనింగ్ చేసి ఆ తర్వాత ప్రేక్షకుల ముందు పెట్టాలని సుప్రీం ఆదేశించింది.