దేశాన్ని ప్రస్తుతం కరోనా వణికిస్తోంది.. ఈ తరుణంలో థర్డ్ వేవ్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కె. విజయరాఘవన్ వ్యాఖ్యనించిన విషయం తెలసిందే. ఈ తరుణంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సెకండ్ వేవ్ నే అడ్డుకోలేకోపెయారు.. థర్డ్ వేవ్ ను ఎలా ఎదుర్కొంటారు అని కేంధ్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. దేశంలో చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఒకసారి పునరాలోచించుకోవాలని పేర్కొంది. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ప్రకంపనలతో ఇప్పటికే దేశం మొత్తం అతలాకుతలమవుతున్న సమయంలో థర్డ్ వేవ్ తప్పదంటూ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు డాక్టర్ కే విజయరాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వేవ్ ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు తప్పదన్నారు. అంతేకాదు థర్డ్ వేవ్ నాటికి వైరస్ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ తయారు చేసుకోవాలని విజయరాఘవన్ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని తెలిపారు.