మహిళా దినోత్సవం రోజు

Update: 2024-03-08 10:30 GMT

సుధా మూర్తి. పరిచయం అక్కరలేని పేరు. ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాకుడు నారాయణమూర్తి భార్య అయిన ఆమె రాజ్య సభకు నామినేట్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు వారం రోజుల ముందు ఈ కీలక ప్రకటన వెలువడింది. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సుధా మూర్తి ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్య సభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుధా మూర్తి ప్రస్తుతం మూర్తి ట్రస్ట్ కు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. మహిళా దినోత్సవం రోజు ఈ ప్రకటన రావటం విశేషం.

సుధామూర్తి రాజ్య సభకు నామినేట్ అయ్యేందుకు వంద శాతం అర్హతలు ఉన్నా కూడా ఈ టైమింగ్ చూస్తే మాత్రం రాజకీయ కోణంలోనే ఈ నిర్ణయం ఉందనే అనుమానాలు రావటం సహజం. సామాజిక సేవ, విద్య, దాతృత్వం వంటి వాటి విషయంలో సుధా మూర్తి సేవలు ఎంతో గొప్పవని...ఆమె రాజ్య సభకు నామినేట్ అవ్వటం నారీశక్తికి నిదర్శనం అని మోడీ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో మహిళల శక్తి సామర్ధ్యాలను చాటి చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు.

Tags:    

Similar News