కుప్ప‌కూలిన మార్కెట్లు

Update: 2022-02-14 03:58 GMT

భార‌తీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం నాడు ప్రారంభంలోనే కుప్ప‌కూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్ల‌కు పైగా న‌ష్టంతోనే ట్రేడ్ అవుతోంది. ఏబీజీ షిప్ యార్డ్ కు సంబంధించి దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్కామ్ వెలుగు చూడ‌టంతో ఆ ప్ర‌భావం మార్కెట్ల‌పై కూడా పడింది. 22843 కోట్ల రూపాయ‌ల మోస‌పూరిత రుణాల‌కు సంబంధించి ఎస్ బీఐ లీడ్ క‌న్సార్టియంగా ఉంది. దీంతో సోమ‌వారం నాడు ప్రారంభంలోనే ఎస్ బిఐ షేరు ధ‌ర 22 రూపాయ‌ల మేర న‌ష్ట‌పోయింది. మార్కెట్లో అత్య‌ధిక వెయిటేజ్ ఉన్న రిల‌య‌న్స్ షేరు ధ‌ర కూడా ఏకంగా 40 రూపాయ‌ల న‌ష్ట‌పోయింది ప్రారంభంలోనే. తొమ్మిదిన్న‌ర గంట‌ల స‌మ‌యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1216 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ్ అవుతోంది. 

Tags:    

Similar News