కొనసాగుతున్న లాభాలు

Update: 2024-09-16 04:03 GMT

స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఈ వారం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం మార్కెట్లకు కీలకం కానుంది. అదానీ పవర్ షేర్ సోమవారం నాడు పెద్ద ఎత్తున లాభపడింది. దీనికి ప్రధాన కారణం ఈ కంపెనీ మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 6600 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసే కాంట్రాక్టు ను దక్కించుకోవటమే. ప్రస్తుతం సరఫరా అవుతున్న ధర కంటే యూనిట్ కు రూపాయి తక్కువ ధరకు బిడ్ చేసి అదానీ పవర్ ఈ ప్రాజెక్ట్ దక్కించుకోవటం విశేషం.

                                            ఈ వార్తలతో మార్కెట్ ప్రారంభంలోనే అదానీ పవర్ షేర్ దగ్గర దగ్గర 30 రూపాయల లాభంతో ట్రేడ్ అవుతోంది. గత కొంత కాలంగా వార్తల్లో నిలిచినా స్పైస్ జెట్ షేర్స్ కూడా సోమవారం నాడు లాభాలతో కొనసాగుతున్నాయి. తొమ్మిదిన్నర సమయంలో బిఎస్ఈ సెన్సెక్స్ వంద పాయింట్ల లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. ఈ వారం లో మార్కెట్ లో కొత్త గరిష్ట స్థాయిలకు చేరే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News