
పతనం ఆగటం లేదు. ఒక్క రోజు సెలవు తర్వాత గురువారం నాడు ప్రారంభం అయిన మార్కెట్లు భారీ పతన దిశగానే సాగుతున్నాయి. అమెరికా ఫెడ్ నుంచి వచ్చిన వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం చూపించాయి. భారత్ లోనూ ఈ ప్రభావం పడింది. మార్కెట్ ప్రారంభం అయిన వెంటనే జరిగిన పతనంతోనే మదుపర్లు ఏకంగా నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర సంపద నష్టపోయారు. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1246 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడ్ తో వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతోపాటు ఏడేళ్ళ గరిష్టానికి ఇంధన ధరల పెరుగుదల, బడ్జెట్ అంచనాలపై అప్రమత్తత వంటి అంశాలు అన్నీ కలుపి మార్కెట్లో అమ్మకాలకు పురికొల్పుతున్నాయి.