ఎట్టకేలకు శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. ప్రారంభం నుంచి గ్రీన్ లో కొనసాగుతున్నాయి.గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున నష్టాలను మూటకట్టుకున్న మార్కెట్లు షార్ట్ కవరింగ్ తో లాభాల బాట పట్టినట్లు కన్పిస్తోంది. కీలక రంగాలకు చెందిన షేర్లు అన్నీ గ్రీన్ లోనే కొనసాగుతున్నాయి. ఇది మదుపర్లకు ఊరట కలిగిస్తోంది. అయితే మార్కెట్ దశ, దిశను ఫిబ్రవరి1న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ మాత్రమే నిర్దేశించగలదని భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. సరిగ్గా శుక్రవారం ఉదయం 9.50 గంటల సమయంలో బిఎస్ఈ సెన్సెక్స్ 653 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.