గత కొన్ని రోజులుగా మదుపర్లకు చుక్కలు చూపించిన స్టాక్ మార్కెట్ సోమవారం నాడు మాత్రం శుభారంభం చేసింది. ప్రారంభం నుంచి సెన్సెక్స్ లాభాలతోనే కొనసాగుతోంది. తొమ్మిదిన్నర గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 736 పాయిట్ల లాభంతో ఉంది. బడ్జెట్ పై అంచనాలతో పలు రంగాలకు చెందిన షేర్లు అన్నీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీ సర్కారు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోకపోవచ్చని భావిస్తున్నారు. మార్కెట్లో అత్యధిక వెయిటేజ్ ఉన్న రిలయన్స్ షేరు 32 రూపాయల లాభంతో 2368 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా..ఎస్ బిఐ షేరు 12.30 రూపాయల లాభంతో 535 రూపాయల వద్ద ఉంది.
ఎస్ బిఐ ఇంచు మించు 52 వారాల గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. మంగళవారం నాఉ జబడ్జెట్ మార్కెట్ దశ, దిశను నిర్ణయించే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఊగిసలాట కొనసాగే ఉంది. కొద్ది రోజులుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎప్ఐఐ)లు భారత మార్కెట్ నుంచి ఏకంగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బడ్జెట్ నిర్ణయాలకు అనుగుణంగానే ఎప్ఐఐలతోపాటు ఇతర ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టుబడిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.