స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. సోమవారం ప్రారంభం నుంచి సెన్సెక్స్ తగ్గుతూ వస్తోంది. ప్రారంభంలో స్వల్ప నష్టాలతో ప్రారంభం అయినా..ఆ వెంటనే వచ్చిన అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల బారిన పడింది. పది గంటలకు ముందు ఓ దశలో సెన్సెక్స్ ఏకంగా మరో 500 పాయింట్ల మేర నష్టపోయింది. గత కొన్ని రోజులుగా మదుపర్లకు చుక్కులు చూపిస్తున్న జొమాటో షేరు పతన బాటలోనే ఉంది. ఈ షేరు పది గంటల సమయంలో పది రూపాయల నష్టంతో 102 రూపాయల వద్ద కొనసాగుతోంది.
లిస్టింగ్ దగ్గర నుంచి మదుపర్లకు వేల కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చిన పేటీఎం సంస్థదీ అదే వరస. ఈ షేరు ఏకంగా 931 రూపాయలకు పడిపోయింది. ఇదే అత్యంత కనిష్ట స్థాయి కావటం విశేషం. 2150 రూపాయల ధరతో పేటీఎం మార్కెట్లోకి వచ్చింది. కానీ ఇంత వరకూ ఎప్పుడూ ఆ ధరను తాకలేదు. రిలయన్స్ షేరు నష్టాలతో ట్రేడ్ అవుతుండగా..ఎస్ బిఐ మాత్రం లాబాలతో కొనసాగుతోంది.