శ్రీలంక కీలక నిర్ణయం

Update: 2023-10-24 08:57 GMT

ఆర్థిక సంక్షోభం నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్న శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికీ పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించేందుకు భారతీయులకు ఉచిత వీసా సౌకర్యం కల్పించనుంది. ఈ మేరకు శ్రీలంక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఉచిత వీసా ఒక్క ఇండియా కే కాకుండా చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ పౌరులకు కూడా వర్తిస్తుంది. ఈ సౌకర్యం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఉచిత వీసా తక్షణమే అమల్లోకి వస్తుంది అని శ్రీలంక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అలీ సబ్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో శ్రీలంకకు ఏభై లక్షల మంది పర్యాటకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పర్యాటక శాఖ వెల్లడించింది.

                                             ఈ నిర్ణయం వల్ల పర్యాటకులకు డబ్బు ఆదా కావటంతో పాటు వీసా కోసం సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉండదు అని తెలిపారు. ప్రతి ఏటా భారత్ నుంచి శ్రీలంక కు పర్యాకులు లక్షల సంఖ్యలో వెళుతుంటారు. వారికి ఇప్పుడు శ్రీలంక తీసుకున్న నిర్ణయం ఉపయోగపడనుంది అనే చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు టూరిస్ట్ గా వెళ్లే వారు వీసా కోసం అన్ని చార్జీలు కలుపుకుని 2200 రూపాయల వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. శ్రీలంక తాజా నిర్ణయంతో ఇప్పుడు ఉచితంగా వీసా దక్కనుంది. 

Tags:    

Similar News