బ్రస్సెల్స్ విమానాశ్రయంతో స్పైస్ జెట్ ఒప్పందం

Update: 2021-01-12 08:13 GMT

కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా విషయంలో స్సైస్ జెట్ అనుబంధ సంస్థ స్పైస్ ఎక్స్ ప్రెస్ దూకుడుగా ఉంది. పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంటూ కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా వ్యాపారంలో సింహభాగం దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే యూరప్ తోపాటు ఇతర ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు బెల్జియంకు చెందిన బ్రస్సెల్స్ విమానాశ్రయంతో అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుంది.

దేశమంతటా కూడా కరోనా వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి స్పైస్ ఎక్స్ ప్రెస్ ముందుంది. నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉన్నందున దీనికి స్పైస్ జెట్ పూర్తిగా సిద్ధం అయింది. ప్రభుత్వంతోపాటు ఫార్మా కంపెనీలతో కలసి సంయుక్తంగా అత్యంత సురక్షితంగా వ్యాక్సిన్ సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు బ్రస్సెల్స్ విమానాశ్రయంతో స్పైస్ జెట్ కు డైరక్ట్ లింక్ ఏర్పడనుందని తెలిపారు.

Tags:    

Similar News