చౌక ధరల ఎయిర్ లైన్స్ కష్టాలు

Update: 2024-02-12 05:10 GMT

గత కొంత కాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే సారి 1400 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. ఇది కంపెనీ ఉద్యోగులలో 15 శాతంగా చెపుతున్నారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపుతో పాటు పలు చర్యలు చేపట్టినట్లు కంపెనీ చెపుతోంది. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు తీసుకుంటున్నట్లు సమాచారం.

కొంతకాలంగా ఈ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు జీతాలు చెల్లించటంలో కూడా జాప్యం చేస్తూ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగటంతో పలు ఎయిర్ లైన్స్ పరిస్థితి మెరుగుపడుతూ వస్తోంది. అయినా గత కొన్ని సంవత్సరాలుగా పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్న స్పైస్ జెట్ మాత్రం తిరిగి గాడిన పడటానికి నానా తంటాలు పడుతోంది. మరి ప్రస్తుతం తీసుకున్న చర్యలు స్పైస్ జెట్ ని పాత స్థితికి తెస్తాయో లేదో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News