ఈ సెమీ హైస్పీడ్ రైల్వే ట్రాక్ ను బెంగుళూరులోని యలహంక స్టేషన్ నుంచి హైదరాబాద్ లోని సికింద్రాబాద్ స్టేషన్ ల మధ్య ఏర్పాటు చేస్తారు. వీటి మధ్య దూరం 503 కిలోమీటర్లు ఉంటుంది. ఈ హై స్పీడ్ రైల్వే ట్రాక్ రెండు వైపుల కూడా 1.5 మీటర్ల ఎత్తుతో గోడ కూడా నిర్మించనున్నారు. మధ్యలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చేసేందుకే ఈ గోడ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల ప్రకారం హైదరాబాద్-బెంగుళూరుల మధ్య ప్రయాణ సమయం పది నుంచి పదకొండు గంటలు పడుతుంది. అయితే ప్రతిపాదిత సెమీ హై స్పీడ్ రైల్వే ట్రాక్ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి..ఎప్పటికి పూర్తవుతాయి అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.