Full Viewదేశంలో ప్రస్తుతం అత్యంత లాభదాయక సంస్థగా ఎస్ బిఐ నిలిచింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బిఐ లాభదాయకత విషయంలో దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ను బీట్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో అంటే 2023 ఏప్రిల్ -జూన్ కాలంలో ఎస్ బిఐ నికర లాభం 16884 కోట్ల రూపాయలుగా నమోదు అయింది. ఇప్పటివరకు ఎప్పుడూ కూడా మూడు నెలల కాలంలో ఎస్ బిఐ కి ఇంత భారీ మొత్తంలో లాభం రాలేదు.ఇదే సమయంలో రిలయన్స్ లాభం 16011 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం దేశంలోనే అత్యధిక లాభాలు ఆర్జించిన కంపెనీగా రిలయన్స్ ఉంది. దీని తర్వాత స్థానాల్లో ఎస్ బిఐ , హెచ్ డీఎఫ్ సి బ్యాంకు లు ఉన్నాయి.