ప్రపంచంలోని ప్రముఖ ఐటి సంస్థ ఛైర్మన్ మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా సత్య నాదెళ్ళ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీఈవోగా కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఛైర్మన్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న జాన్ థామ్సన్ స్వతంత్ర డైరక్టర్ గా కొనసాగనున్నారు. సత్యనాదెళ్ళను మైక్రోసాఫ్ట్ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుందని కంపెనీ వెల్లడించింది.