రష్యాతో పోలిస్తే ఏ రకంగా చూసిన ఉక్రెయిన్ సామర్ధ్యం, సత్తా చాలా తక్కువ. కానీ రష్యా చేస్తున్న పాశవిక దాడిని మాత్రం ఉక్రెయిన్ వీరోచితంగా తిప్పికొడుతోంది. అయితే దీనికి పలు దేశాల సాయం కూడా కలసి వస్తోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ లో సామాన్య పౌరుల దగ్గర నుంచి ఉక్రెయిన్ సైన్యం కూడా ప్రాణాలు కోల్పోతోంది. అదే సమయంలో రష్యాకు జరిగే నష్టం కూడా భారీ స్థాయిలో ఉండటం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కు చిక్కులు తెచ్చిపెడుతోంది.
దీనికి సంబంధించి తాజాగా వెల్లడైన సమాచారం రష్యాను మరింత చిక్కుల్లో పడేసేలా ఉంది. ఉక్రెయిన్ తో పోరులో 14400 మంది రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అదే సమయంలో రష్యాకు చెందిన 95 విమానాలను కూడా ఉక్రెయిన్ కూల్చేసింది. వీటితోపాటు 466 యుద్ధ ట్యాంకులు, 1470 సాయుధ ట్యాంకులు, 115 హెలికాప్టర్లతోపాటు రష్యాకు చెందిన పలు యుద్ధ వాహనాలను ధ్వంసం చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.