భారత కరెన్సీ రూపాయి కొత్త కనిష్టస్థాయికి చేరింది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ ఆర్ధికవేత్త ప్రధానిగా ఉన్నా కూడా రూపాయి ఐసీయూలో ఉందని విమర్శలు గుప్పించారు. కానీ ప్రధానిగా మోడీ బాధ్యతల స్వీకరించిన తర్వాత ఈ టర్మ్ లో రూపాయి గతంలో ఎన్నడూలేని రీతిలో పతనం అవుతూ వస్తోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ సోమవారం నాడు రికార్ఢు స్థాయిలో 78కి పడిపోయింది.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో పాటు రకరకాల కారణాలతో రూపాయి విలువ దిగజారుగతోంది. అమెరికా ద్రవ్యోల్భణం 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అందుకే స్టాక్ మార్కెట్లతో పాటు రూపాయి విలువ కూడా దారుణంగా పడిపోతుంది. సోమవారం నాడు ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు వెయ్యి పాయింట్ల మేర పతనం అయ్యాయి.