దేశ టెలికం రంగంలో జియో పెద్ద విప్లవమే తెచ్చింది. ముఖ్యంగా డేటా వినియోగంలో జియో ఎంట్రీతోనే పెను మార్పులు వచ్చాయి. జియో రాక ముందు వరకూ ఉన్న డేటా వినియోగం..జియో వచ్చిన తర్వాత డేటా వినియోగం చూస్తేనే ఈ విషయం తెలిసిపోతుంది. అతి చౌక ఆఫర్లతో గ్రామీణ ప్రాంతాలకు సైతం ఈ ఫోన్లు విస్తరించాయి. ఇటీవలే జియో పలు టారిఫ్ లను సవరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట 5జీ..5జీ. రిలయన్స్ జియో ఇప్పుడు 5జీ ఫోన్ల తయారీతోనూ కొత్త సంచలనానికి నాంది పలకనున్నట్లు సమాచారం. అత్యాధునిక ఫీచర్లతో..అతి తక్కువ ధరతో 5జీ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చే దిశగా ఈ సంస్థ ముందుకు సాగుతోంది. జియో, గూగుల్ భాగస్వామ్యంతో ఇప్పటికకే జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్‌లో 5G విప్లవం ఈ ఏడాది నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
5జీ విస్తరణలో రిలయన్స్ జియో ముందంజలో నిలుస్తోంది. అందుకు తగ్గట్టుగా 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసే పనిలో రిలయన్స్ నిమగ్నమై ఉన్నట్లు చెబుతున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో ఈ ఏడాదే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో అధిపత్యాన్ని చెలాయిస్తోన్న రియల్‌మీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్స్‌కు పోటీగా రిలయన్స్ జియో 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో 13 వేల రూపాయలకు అందుబాటులో ఉంది. దీని కంటే తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ధర విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.