రిల‌య‌న్స్ జియో కూడా రేట్లు పెంచింది

Update: 2021-11-28 14:51 GMT

దేశంలోని టెలికం కంపెనీలు అన్నీ వ‌ర‌స పెట్టి చార్జీలు పెంచుతూ పోతున్నాయి. తొలుత ఎయిర్ టెల్ ఛార్జీల పెంపుతో ముందుకు రాగా..ఆ త‌ర్వాత వోడాఫోన్-ఐడియా కూడా బాట ప‌ట్టింది. ఇప్పుడు రిల‌య‌న్స్ జియో కూడా ఛార్జీల పెంపు నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆదివారం నాడు అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రిల‌య‌న్స్ జియో సుమారు 20 శాతం మేర ప్లాన్‌ ధరలను జియో పెంచింది. పెరిగిన టారిఫ్‌ ప్లాన్ల రేట్లు డిసెంబర్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

జియోఫోన్‌ ప్లాన్‌ రూ. 75 నుంచి రూ. 91కి పెరిగింది. ఆయా ప్లాన్లను బట్టి సుమారు రూ. 24 నుంచి రూ. 480 మేర ధరలు పెరిగాయి. టెలికాం సర్వీసులను మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతకు అనుగుణంగా కొత్త అపరిమిత ప్లాన్‌ రేట్లను పెంచుతున్నట్లు జియో ఒక ప్రకటనలో పేర్కొంది. టెలికాం పరిశ్రమలో ఈ కొత్త టారిఫ్‌ ప్లాన్స్‌ అత్యుత్తమ ప్లాన్స్‌గా నిలుస్తాయని జియో వెల్లడించింది. కొత్త టారిఫ్ ప్లాన్స్ రేట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Tags:    

Similar News