2022 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి కంపెనీ ఏకంగా 1,88,012 కోట్ల రూపాయల పన్ను చెల్లించిందని తెలిపారు. దేశంలో తమ కంపెనీ అతి పెద్ద పన్ను చెల్లింపుదారుగా ఉందని..అలాగే కొనసాగుతుందన్నారు కూడా. అంతే కాదు దేశంలో ఏకంగా 100 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు నెలకొల్పింది. అంతే కాదు దేశంలో అత్యధికంగా ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థగా కూడా రిలయన్స్ నిలిచింది. గత ఆర్ధిక సంవత్సరం అంటే 2022మార్చితో ముగిసిన కాలంలో ఈ కంపెనీ కొత్తగా 2.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. రిలయన్స్ ఈ దీపావళి నాటికే దేశంలో మెట్రో నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. 2023 డిసెంబర్ నాటికి దేశమంతటా కూడా రిలయన్స్ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.