ఆ దేవాలయానికి 20 కేజీల బంగారం విరాళం

Update: 2020-11-07 08:22 GMT

ముఖేష్ అంబానీ. సెంటిమెంట్లు ఎక్కువ. అంబానీ కంటే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి భక్తి మరీ ఎక్కువ. ఆమె తిరుమలతో పాటు హైదరాబాద్ లోని బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాన్ని ప్రతి ఏటా తప్పకుండా సందర్శిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు కూడా. అసలు ఇప్పుడు ఇది అంతా ఎందుకంటే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఓ దేవాలయానికి ఏకంగా 20 కిలోల బంగారం కానుకగా సమర్పిచింది. దేశంలోని ప్రముఖ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్యాదేవి ఆలయం కోసం 20 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. అసోంలో ప్రాముఖ్యత గాంచిన ఈ దేవాలయ మూడు గోపుర కలశాలను బంగారంతో తీర్చిదిద్దనున్నారు.

నీలాచల్ హిల్స్‌ లోని కామాఖ్యా ఆలయానికి దీపావళి బహుమతిగా రిలయన్స్ సంస్థ ఈ విరాళం అందజేసింది. ఈ దేవాలయానికి సంబంధించిన ఇప్పటికే ప్రారంభం అయ్యాయని ఆలయ పూజారి దీప్ శర్మ వెల్లడించారు. మూడు కలశాల బంగారం తాపడం ఖర్చులు తాము భరిస్తామని ఆలయ అధికారులకు హామీ ఇచ్చారని శర్మ వెల్లడించారు. రిలయన్స్‌ ఇంజనీర్లు, శిల్పకారుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే దీపావళికి ముందే బంగారం తాపడం పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అంబానీ దంపతులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News