వ్యాక్సిన్ల‌పై రామ్ దేవ్ బాబా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

Update: 2021-05-31 14:40 GMT

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ జోరుగా సాగుతున్న త‌రుణంలో వ్యాక్సిన్ల‌పై రామ్ దేవ్ బాబా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న అల్లోప‌తిపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే మ‌ళ్లీ ఈ వివాదాన్ని తెర‌పైకి తెచ్చారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రూ వ్యాక్సిన్ల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంటే...బాబా రామ్ దేవ్ మాత్రం వీటి వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని వ్యాఖ్యానించ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. కరోనా వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. తాను వ్యాక్సిన్ తీసుకోలేదని, సుదీర్ఘ కాలంగా సాధన చేస్తున్న యోగా, ఆయుర్వేదమే తనకు రక్ష అని పేర్కొన్నారు. ఈ సందర్భంగావ్యాక్సిన్‌ల సమర్థత, అల్లోపతి ప్రభావంపై తన దాడిని కొన‌సాగించారు.

పురాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) వెయ్యికోట్ల రూపాయల పరువు నష్టం దావా హెచ్చరిక అనంతరం రాందేవ్‌ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం అభ్యసిస్తున్నాను, కాబట్టి తనకు టీకా అవసరం లేదని రాందేవ్ తెలిపారు. భారతదేశంతో పాటు విదేశాలలో 100 కోట్లకు పైగా ప్రజలు ఈ పురాతన చికిత్స ద్వారా లబ్ది పొందుతున్నారనీ, రానున్న కాలంలో ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించనుందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News