పార్టీ పెట్టారు. కానీ ఆ పార్టీ ఎక్కడా బరిలోకి దిగలేదు. కానీ అంతలోనే రద్దు ప్రకటన కూడా వెలువడింది. ఈ వ్యవహరం అంతా సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీకి సంబంధించినదే. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ కోట్లాది మంది అభిమానులు కోరుకోగా ఆయన ఊరించి ఊరించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనారోగ్య కారణాలు చెప్పి రాజకీయాల్లోకి రావటంలేదని తేల్చిచెప్పేశారు. రజినీకాంత్ తన అభిమానులతో తిరిగి సమావేశం అవుతున్న తరుణంలో రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తాడంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వీటిపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. అదే సమయంలో రాజకీయ పార్టీగా చెప్తున్న రజినీ మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు సోమవారం అభిమానులతో సమావేశమైన తలైవా.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు రజినీ మక్కల్ మండ్రంను ఫ్యాన్స్ క్లబ్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. 'అన్నాతే' సినిమాలో నటిస్తున్న రజినీ.. అరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ మధ్యే అమెరికాకు వెళ్లి వచ్చాడు. కరోనా, తమిళనాడు ఎన్నికలు, అమెరికా చెకప్ నేపథ్యంలో అభిమానులకు ఇంతకాలం దూరంగా ఉన్నానని, ఈ నేపథ్యంలోనే సమావేశం అయ్యానని ఆయన సమావేశం ముందు మీడియాకు స్పష్టం చేశాడు. అయితే రాజకీయ భవిష్యత్త్ పైనా ఈ చర్చల తర్వాత స్పష్టం చేస్తానని చెప్పిన రజనీ ఊహాగానాలకు తెరదించుతూ ఇక రాజకీయాలు లేనట్లేనని స్పష్టం చేశాడు.