భారత్ బయోటెక్ యూనిట్ లో ప్రధాని మోడీ

Update: 2020-11-28 12:08 GMT

ప్రధాని నరేంద్రమోడీ శనివారం నాడు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేస్తున్న 'కోవాగ్జిన్' పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని సమీక్షించారు. వాక్సిన్‌ తయారీ కోసం అహర్నిహలు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలతో మోదీ సమీక్షించారు. వ్యాక్సిన్‌ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ మోడీ ట్వీట్‌ చేశారు. ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి పని చేస్తోందన్నారు. కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు.

ప్రధాని పర్యటనపై భారత్ బయోటెక్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. మోడీ పర్యటన తమకు ఎంతో ఉత్సాహన్ని ఇచ్చిందని, ఇది తాము పెద్ద గౌరవంగా భావిస్తున్నామని తెలిపింది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 'కోవాక్సిన్' అన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి మూడవ దశ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. దేశంలోని 25 ప్రదేశాల్లో 26 వేల మందిపై ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని బయోసేఫ్టీ లెవల్ 3 ఉన్న ఏకైక కంపెనీ భారత్ బయోటెక్ మాత్రమే. వ్యాక్సిన్ తయారీలో తమకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది కంపెనీ.

Tags:    

Similar News