ఢిల్లీ లో అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్

Update: 2023-09-17 12:18 GMT

ప్రపంచంలోని అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటి ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తన పుట్టినరోజు సందర్భంగా ఈ యశో భూమి సెంటర్ ను ప్రారంభించారు. 5400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ సెంటర్ 8 .9 లక్షల స్క్వేర్ మీటర్ల లో ఉంటుంది. అయితే ఇందులో 1 .8 లక్షల చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ దేశంలోనే అతి పెద్ద ఎల్ఈడీ మీడియా ప్రచార వేదిక ఉంది.

                                       Full Viewప్రపంచంలోని అతి పెద్ద మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సస్ అండ్ ఎక్సిబిషన్స్ ) కేంద్రాల్లో ఇది ఒకటి అని వెల్లడించారు. అంతర్జాతీయ సమావేశాలు..సదస్సులకు ఇది ఎంతో అనువైన కేంద్రంగా ఉంటుంది. ఇందులో ప్రధాన ఆడిటోరియం తో పాటు 15 సమావేశ మందిరాలు ఉన్నాయి. ఒకే సారి ఇక్కడ పదకొండు వేల మంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొనవచ్చు. కొన్ని హాల్స్ లో అవసరానికి అనుగుణంగా సీటింగ్ లో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గ్రాండ్ బాల్ రూమ్ లో 2500 మంది కూర్చోవచ్చు.

Tags:    

Similar News