దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ ఎల్) ఎవరి పరం కానుంది?. అతి త్వరలోనే ఈ వ్యవహారం తేలిపోయింది. అయితే ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం పిరమల్ గ్రూపు ఈ విషయంలో ముందంజలో ఉన్నట్లు సమాచారం. పోటీ సంస్థ ఓక్ టీ తో పోలిస్తే పిరమల్ ఆఫర్ లో పలు అంశాలు ఆ కంపెనీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. డిహెచ్ఎఫ్ఎల్ దివాళా తీర్మాన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొస్తుండటంతో, కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ) ఈ అంశానికి గురువారం ఏ విధంగా ముగింపు పలుకుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్టసీ కోడ్ (ఐబీసీ) ద్వారా ముందుకు వెళ్తోన్న మొట్టమొదటి ఆర్ధిక సేవల కంపెనీగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ నిలిచింది. బిడ్డర్లందరూ పలు రకాల వాదనలు చేశారు. సీఓసీ వద్ద తాజా బిడ్లు కూడా దాఖలు కావడంతో వాటి అర్హతలను పరిశీలించడానికి గురువారం జరిగే ఓటింగ్ ప్రక్రియకు ముందు రెండు వారాలకు పైగా సమయం కూడా సీఓసీకి దక్కింది.
పలు సంస్థలు దాఖలు చేసిన బిడ్లను అత్యంత జాగ్రత్తగా అధ్యయనం చేసిన తరువాత పిరామల్ గ్రూప్‌తో పాటుగా ఓక్ ట్రీ క్యాపిటల్ బిడ్లు ఎంపికయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అత్యధిక అప్ ప్రంట్ క్యాష్ ను పిరామల్ బిడ్ అందిస్తుండటంతో ఇది అత్యుత్తమంగా భావిస్తున్నారు. ''పిరామల్ ప్రణాళికలో అత్యధిక అప్‌ఫ్రంట్ క్యాష్‌ను సైతం జోడించింది. ఇది క్రెడిటార్లకు అత్యధిక లిక్విడిటీని సైతం అందిస్తుంది. అంతేకాదు, పరిశీలన కోసం తప్పనిసరి స్కోర్‌కార్డ్ లో సైతం దీని బిడ్ అత్యధిక స్కోర్స్ ను సైతం నమోదు చేసింది'' అని ఆ వర్గాలు వెల్లడించాయి. ''ఓక్‌ట్రీ బిడ్ కూడా ఎంపికైనప్పటికీ, దీనికి నియంత్రణ సంస్ధల సమస్యలు సైతం ఉన్నాయి. ఈ కారణంగా చట్టపరమైన అవరోధాలు, సవాళ్లు ఎదురుకావొచ్చని భావిస్తున్నారు. దీనివల్ల రిజల్యూషన్ ప్రక్రియకు సుదీర్ఘకాలం కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి'' అని ఆ వర్గాలు వెల్లడించాయి. ''ఓక్ ట్రీ ప్రతిపాదనలను ఐఆర్‌డీఏ అనుమతించకపోవచ్చని భావిస్తున్నారు.
ఓక్‌ట్రీకి ఇది చాలా కీలకం, ఎందుకంటే, భీమా వ్యాపారం పరిష్కరించబడకపోతే, రిజల్యూషన్ అసంపూర్ణంగా ఉంటుంది'' అని ఆ వర్గాలు వెల్లడించాయి. పిరామల్ బిడ్‌లో భీమా వ్యాపారం కోసం నేరుగా 1000 కోట్ల రూపాయలను ఆఫర్ చేసింది, దీనిని డీహెచ్‌ఎఫ్‌ఎల్ స్ధాయిలో చెల్లిస్తారు. ఇది ఓక్‌ట్రీ ఆఫర్‌కు పూర్తి భిన్నం. ఎందుకంటే ఓక్‌ట్రీ ఆఫర్‌లో అనుబంధ (డీఐఎల్) స్థాయిలో చెల్లిస్తారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఋణదాతలకు ప్రయోజనం కలిగించే స్పష్టమైన మార్గమేది ఇక్కడ లేదు. దీనికి తోడు, పిరామల్ ఇప్పుడు 3800 కోట్ల రూపాయల ఈక్విటీని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో జొప్పించడంతో పాటుగా మరో 16వేల కోట్ల రూపాయలను భవిష్యత్ ఆర్థిక సేవల వ్యాపారం కోసం అందుబాటులో ఉంచనుంది. అత్యంత లాభదాయకమైన, నియంత్రణ సంస్థల ప్రమాణాలకు లోబడిన మరియు మరీ ముఖ్యంగా క్రెడిటార్లకు అత్యంత వేగవంతమైన టర్న్ ఎరౌండ్ సమయం అందించే బిడ్ వైపే సీఓసీ మొగ్గు చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల భావన. పిరామల్ ప్రణాళిక అమలు చేయడానికి అధిక సమయం పట్టదు. ఎందుకంటే భీమా సంబంధిత సమస్యలు ఇక్కడ లేవు. ఇది ఋణదాతలకు వడ్డీ ఆదాయంపై ఓపెన్ ఎండెడ్ కమర్షియల్ రిస్క్ తగ్గిస్తుంది.