ఇన్వెస్ట‌ర్ల‌కు పేటీఎం షాక్

Update: 2021-11-18 08:33 GMT

ఈ మ‌ధ్య‌లో ఏ ఐపీవో వ‌చ్చినా గంట‌ల్లోనే ఓవ‌ర్ సబ్ స్క్రైబ్ అయిపోతుంది. మార్కెట్ ప‌రిస్థితుల‌ను క్యాష్ చేసుకునేందుకు వ‌ర‌ద‌లా ఐపీవోలు కూడా మార్కెట్ ను ముంచెత్తాయి. అయితే ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన ఐపీవోలు ఇన్వెస్ట‌ర్ల‌కు మంచి లాభాల‌నే ఇచ్చాయి. అయితే దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా మార్కెట్లోకి వ‌చ్చి సంచ‌ల‌నం నమోదు చేసిన పేటీఎం షేర్లు మాత్రం మ‌దుప‌ర్లుకు షాక్ ఇచ్చాయి. చాలా కంపెనీల మ‌దుప‌ర్ల‌కు మంచి లాభాలు ఇవ్వ‌గా..పేటీఎం మాత్రం తొలి రోజునే న‌ష్టాల‌ను న‌మోదు చేసింది. ఆఫ‌ర్ ద‌ర కంటే భారీ న‌ష్టంతో ట్రేడ్ అవుతోంది. పేటీఎం పేరెంట్ కంపెనీ వ‌న్ 97 క‌మ్యూనికేష‌న్స్ లిమిటెడ్ షేర్లు గురువారం నాడు ఎన్ ఎస్ఈ, బీఎస్ ఈల్లో న‌మోదు అయ్యాయి.

పేటీఎం ఇష్యూ ధ‌ర 2150 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. ఈ సంస్థ ఏకంగా 18300 కోట్ల రూపాయ‌లు మార్కెట్ నుంచి స‌మీక‌రించి అతి పెద్ద ఐపీవోగా నిలిచింది. గురువారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో కూడా షేర్ ఆఫ‌ర్ ద‌ర కంటే 497 రూపాయ‌ల న‌ష్టంతో 1652రూపాయ‌ల వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈలో ఈ షేరు ధ‌ర 1,961.05 వ‌ద్ద ప్రారంభం అయింది. అయితే పేటీఎం షాక్ భ‌విష్య‌త్ ఐపీవోల‌పై ప్ర‌భావం చూపిస్తుందా? లేక ఇన్వెస్ట‌ర్లు రాబోయే ఐపీవోల్లో అదే ఊపు చూపిస్తారా అన్న‌ది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News