పేటిఎం ఇన్వెస్టర్స్ విలవిల

Update: 2022-11-22 11:43 GMT

పేటీఎం షేర్స్ ఇన్వెస్టర్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ కంపెనీ మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ వాటాలు మంగళవారం నాడు కొత్త కనిష్ట స్థాయిని తాకాయి. దీంతో ఏడాది క్రితం 1.15 లక్షల కోట్ల రూపాయలు ఉన్న పేటిఎమ్ మార్కెట్ క్యాపిటలైజషన్ ఇప్పుడు 33 వేల కోట్ల రూపాయలకు పతనం అయింది. మంగళవారం నాడు ఈ షేర్ 63 రూపాయల వరకు నష్ట పోయింది. ఒక దశలో 474 రూపాయల కనిష్ట స్థాయికి తాకి..చివరకు 59 రూపాయల నష్టంతో 477 రూపాయల వద్ద ముగిసింది. ఐపీవో కి ముందు జారీచేసిన షేర్ల ఏడాది లాక్ ఇన్ పీరియడ్ నవంబర్ 15 ముగియటంతో ఈ అమ్మకాల ఒత్తిడి వచ్చినట్లు చెపుతున్నారు. మే 12 న ఈ కంపెనీ షేర్లు 511 రూపాయల కనిష్ట స్థాయికి చేరాయి. ఇప్పుడు ఇది కొత్త కనిష్టం. పేటిఎం స్టాక్ మార్కెట్ నుంచి ఒక్కో షేర్ కు 2150 రూపాయలతో నిధులు సమీకరించింది. ఇంత వరకు ఒక్కసారి కూడా ఈ షేర్స్ ఆఫర్ ధర వద్దకు చేరుకోలేదు.

Tags:    

Similar News