ఈ ధరతో పోలిస్తే పేటిఎం షేర్లు 65 శాతం పైగా పతనం అయినట్లు అయింది. ఈ కంపెనీ పై విధించిన ఆంక్షల విషయంలో ఆర్ బీఐ కఠినంగా ఉంటడంతో ఈ కంపెనీ షేర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. మరో వైపు పేటిఎం పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇన్వెస్టర్లను మరింత కలవరానికి గురి చేస్తోంది. ఆర్ బీఐ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగానే ఈడీ విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఇది ప్రాథమిక దశలోనే ఉంది అని...పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలా వద్దా అనే అంశంపై అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెపుతున్నారు. మరో వైపు కంపెనీ ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా పేటిఎం లో పని చేస్తున్న ఉద్యోగులు కొత్త మార్గాలను వెతుక్కునే పనిలో పడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.