ఈ తీర్పు చాలా వెరైటీ

Update: 2023-07-23 06:40 GMT

Full Viewకొన్ని కోర్టు తమ తీర్పులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. మరి కొన్ని ఆశ్చర్యం కలిసాగిస్తాయి. ఇప్పుడు అలాంటి ఆశ్చర్యకర తీర్పు ఒకటి వెలువడింది. ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. కొంత మంది భార్యాభర్తలు వివాదాల కారణంగా విడిపోతారు...వీళ్లకు కోర్టులు కూడా విషయాలు పరిశీలించి విడాకులు మంజూరు చేస్తాయి. అదే సమయంలో భర్త నుంచి విడిపోయిన భార్యకు జీవనం సాగించేందుకు అవసరమైన ఖర్చులు భర్తే చెల్లించాలని అదేశిస్తుంది. ఇది చాలా కేసుల్లో జరిగే విషయమే. అయితే ముంబై కోర్టు ఒకటి భార్యతో పాటు ఆమెతో ఉంటున్న మూడు పెంపుడు కుక్కల ఖర్చు కూడా ఆమె భర్త భరించాల్సిందే అని ఆదేశించింది. భార్యా, భర్తల బంధం విడిపోయిన తర్వాత ..ఆ కుక్కలే ఆమె భావోద్వేగ లోటు ను తీరుస్తాయి అని కోర్టు వ్యాఖ్యానించటం విశేషం. అందుకే ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. విడిపోయిన భార్యకు ఇచ్చే నిర్వహణ మొత్తంలో పెట్స్ ఖర్చు చేర్చటం సరికాదు అని ఆమె భర్త తరపు లాయర్ ముంబై లోని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు వాదించారు...దీన్ని కోర్టు తోసిపుచ్చింది.

                                      ఆ సమయంలోనే ఆమె పెంచుకునే మూడు కుక్కల వ్యయం కూడా భరించాల్సిందే అని తేల్చి చెప్పింది. 55 సంవత్సరాల మహిళ తనకూ...తనతో పాటు ఉండే కుక్కలకు కూడా నిర్వహణ ఖర్చులు ఇప్పించాలని కోర్టు ని ఆశ్రయించగా...కుక్కల అంశంపై భర్త అభ్యంతరం తెలిపాడు. అయితే అతని వాదనను తోసిపుచ్చిన కోర్టు గౌరవప్రదమైన జీవనంలో పెంపుడు కుక్కలు ఒక భాగం అని...అదే సమయంలో బంధాలు బ్రేక్ అయినప్పుడు కొంత భావోద్వేగ శూన్యం ఉంటుంది...అది పూడ్చుకోవటంలో పెట్స్ ఎంతో అండగా ఉంటాయన్నారు. ఆ మహిళ తరపున కోర్టు లో వాదించిన లాయర్ శ్వేతా మోరే ఆమె భర్తపై గృహ హింస ఆరోపణలు చేయటంతో పాటు నెలకు బాధిత మహిళకు 70 వేల రూపాయలు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టు ను కోరారు.అయితే ఇద్దరి ఆర్థిక పరిస్థితులు గణంలోకి తీసుకున్న కోర్టు తుది తీర్పు ఇచ్చేలోగా నెలకు 50 వేల రూపాయలు నెలకు చెల్లించాలని ఆదేశించింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉండగా వాళ్లకు పెళ్లి అయింది..ఇద్దరు విదేశాల్లోనే ఉన్నారు. 

Tags:    

Similar News