రైళ్లల్లో, బస్సు ల్లో అడుక్కునే వాళ్ళను చూడటం సహజమే. బస్సు లు ఆగినప్పుడు కొంతమంది యాచకులు వస్తారు...రైళ్లల్లో అయితే వందే భారత్ వంటివి కాకుండా ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్ల లో అయితే ఇది మాములే. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మెట్రో లో కూడా ఒకతను ఇదే పని చేశాడు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి విమానంలో అడుక్కోవటం చూసి అంతా అవాక్కు అవుతున్నారు. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి ఒకరు ఈ పని చేశారు. దీనికి సంబదించిన చిన్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయింది. అయితే తాను తన కోసం డబ్బులు అడగటం లేదు అని...మదర్సాల నిర్మాణం కోసం డబ్బులు అడుగుతున్నట్లు అయన ప్రకటించాడు.
విమానంలో తన సీట్ నుంచి లేచి డబ్బులు ఇవ్వాలనుకునే వాళ్ళు లేచి రావాల్సిన అవసరం లేదు...తానే వాళ్ళ వాళ్ళ సీట్ల దగ్గరకు వస్తానని ప్రకటించాడు. ఆన్ లైన్ లో ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దీన్ని ఇప్పుడు చాలా మంది ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. కొంత మంది ఈ వీడియో చుసిన వాళ్ళు మాత్రం అయన పేరు అక్తర్ లావా అని చెపుతున్నారు. విమానంలో అడుక్కోవటం ..ఏ కారణం కోసం అయిన బహుశా ఇదే మొదటి సారి అయి ఉండవచ్చు అని చెపుతున్నారు. ఇటీవలే ఆర్థిక సంక్షోభంలో చిక్కు కున్న పాకిస్థాన్ ను ఐఎంఎఫ్ మూడు బిలియన్ డాలర్ల రుణంతో బయటపడేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను విడతలవారీగా విడుదల చేయనున్నారు.