పిల్లలకూ వ్యాక్సిన్ వచ్చేస్తోంది

Update: 2021-05-25 16:03 GMT

అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ మోడెర్నా పిల్లల వ్యాక్సిన్ సంబంధించి మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. 12 నుంచి 17 సంవత్సరాల పిల్లలపై తాము అభివృద్ధ చేసిన వ్యాక్సిన్ 100 శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రకటించింది. రెండు, మూడవ దశల ప్రయోగాల అనంతరం ఈ ప్రకటన చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ అనంతరం పిల్లలపై ఇది సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. 12 నుంచి 18 సంవత్సరాలకు చెందిన 3700 మందిపై ఈ ప్రయోగాలు సాగాయి. ఒక్క డోస్ తర్వాతే పిల్లల్లో కరోనాను ఎదుర్కొనేందుకు 93 శాతం సమర్ధత చూపించినట్లు తెలిపారు.

అదే సమయంలో తమ పరీక్షల్లో ఎలాంటి తీవ్రమైన ప్రతికూల అంశాలను గుర్తించలేదని తెలిపారు. జూన్ లో ఈ వ్యాక్సిన్ అనుమతుల కోసం నియంత్రణా సంస్థలకు దరఖాస్తు చేసుకోనున్నారు. అమెరికాలో ఎఫ్ డిఏ ఆమోదం తర్వాతే వినియోగానికి అనుమతిస్తారనే విషయం తెలిసిందే. రెండవ డోస్ వేసిన 14 రోజుల తర్వాత ఈ వ్యాక్సిన్లు పూర్తి సమర్ధత చూపించాయి. ఇదిలా ఉంటే దేశం లోనూ తాజాగా భారత్ బయోటెక్ పిల్లల వ్యాక్సిన్ కు సంబంధించి ప్రయోగాలు తాజాగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News