దేశీయ స్టాక్స్ లోకి 33 ట్రేడింగ్ సెషన్స్ లో లక్ష కోట్ల రూపాయలు

Update: 2020-12-18 09:24 GMT

ఓ వైపు కరోనా కల్లోలం. మరో వైపు జీడీపీ పతనం. అసలు ఆర్ధిక వ్యవస్థ ఎప్పుడు గాడిన పడుతుందో తెలియని పరిస్థితి. కానీ స్టాక్ మార్కెట్లు మాత్రం దూసుకెళుతూనే ఉన్నాయి. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అంతే కాదు..ఎన్నడూలేని స్థాయిలో ఎప్పటికప్పుడు కొత్త జీవిత కాల గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ఈ సంక్షోభ సమయంలో మరి మార్కెట్ ను నడిపిస్తున్నది ఎవరు?. స్టాక్స్ కొనుగోలు చేస్తున్నది ఎవరు అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది.

నవంబర్ 2 నుంచి 33 సెషన్స్ లో దేశీయ స్టాక్స్ లోకి 1.01 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఎన్ఎస్ఈ డేటా ఈ విషయాలను వెల్లడించింది. ఒక్క దీపావళి రోజు జరిగిన ట్రేడింగ్ లో తప్ప విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలుదారులుగానే ఉన్నారు. అదే సమయంలో భారతీయ ఇన్వెస్టర్లు 33 సెషన్లలో ఏకంగా 75 వేల కోట్ల రూపాయలకుపైగా విక్రయాలు చేశారు. కరోనా కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్ధిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందనే అంచనాలు విదేశీ పెట్టుబడులు రావటానికి కీలక అంశంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News