కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈ రోజు రాత్రి నుంచి జనవరి 2 వరకూ రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఈ కర్ప్యూ అమల్లో ఉండనుంది. బ్రిటన్ నుంచి వచ్చిన కొత్త వైరస్ వ్యాప్తి భయంతోపాటు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు భారీ ఎత్తున నిర్వహించకుండా నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కన్పిస్తోంది.
ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు కూడా రాత్రి పూట కర్ఫ్యూ అమలుకు నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యగా రాత్రి వేళల్లో కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ప్రకటిస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకలపై కూడా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే.