దేశ వ్యాప్తంగా రెండవ దశ కరోనా విస్తృతి అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు వారాంతాల్లో లాక్ డౌన్ విధించటంతోపాటు రాత్రి కర్ఫ్యూలు ప్రకటించింది. ఇప్పుడు ఢిల్లీ సర్కారు కూడా అదే బాట పట్టింది. రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది.
ఏప్రిల్ 30 వరకూ ఇది అమల్లో ఉంటుంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ ఇది అమల్లో ఉండనుంది. అయితే ఢిల్లీలో ప్రస్తుతం నడుస్తున్నది కరోనా నాల్గవ ధశ అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. గత 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 3548 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.