టెక్ రంగం వచ్చే రెండు ఏళ్ళు తీవ్ర సవాళ్లు ఎదుర్కోక తప్పదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సంచలన ప్రకటన చేశారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోని కీలక మార్కెట్లు అన్ని మాంద్యంలోకి వెళ్ళటమే అన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ట్రెండ్ మరికొంత కాలం కూడా కొనసాగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో సత్య నాదెళ్ల ప్రకటన పెద్ద సంచలనమే అని చెప్పుకోవచ్చు. అయితే రెండేళ్ల బాధ తర్వాత ఐటి సెక్టార్ అసాధారణ ప్రగతి సాధిస్తుంది అని అయన వెల్లడించారు. కరోనా సమయంలో పలు కంపెనీలు పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగులను తీసుకున్నాయి.