వీటితో పాటు ద్రవ్యోల్బణం, సప్లై సమస్యలు వంటికి కూడా ప్రధాన కారణంగా ఉండే అవకాశం ఉంది అని అంచనా వేశారు. వచ్చే ఐదేళ్లలో 75 శాతం కంపెనీలు బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ , ఏఐ వంటి అత్యాధునిక సాంకేతిక తను సమకూర్చుకోనున్నాయి. ప్రధానంగా విద్య, వ్యవసాయం, డిజిటల్ కామర్స్, వాణిజ్య రంగాల్లో మాత్రం కొత్త ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. మరో కీలక అంశం ఏమిటి అంటే వచ్చే ఐదేళ్లలో 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు కాలం చెల్లుతుంది అని పలు కంపెనీల యాజమాన్యాలు వెల్లడించాయి. వీరిలో ఎంత మంది తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని కంపెనీల అవసరాలకు అనుగుణంగా రెడీ అవుతారు అన్నది ఇప్పుడు మరో సవాలుగా మారబోతుంది.