ఇన్‌స్టాగ్రామ్ అనుబంధంగా జుకర్ బర్గ్ ఈ యాప్‌ను తీసుకొచ్చాడు. థ్రెడ్స్ చాలావరకు ట్విట్టర్‌లో ఉన్న ఫీచర్లను కలిగిన స్వతంత్ర ఫ్లాట్‌ఫారమ్. అయితే థ్రెడ్స్ లాంచింగ్‌తో ట్విట్టర్‌లో భిన్న అభిప్రాయాలతో మీమ్స్ హడావుడి కొనసాగుతోంది. అయితే మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్స్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10 మిలియన్ల మందికి పైగా వినియోగదారులను సంపాదించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా జుకర్ బర్గ్ కొత్త ఫ్లాట్‌ఫారమ్ థ్రెడ్స్‌లో తెలిపాడు.