మరో కలకలం. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త స్టెయిన్ వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పలు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను నిషేధించాయి. ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకునే తరుణంలో ఈ వ్యవహారం మరింత కలకలం రేపుతోంది. ఓ వైపు వ్యాక్సిన్ వచ్చిందనే ఆనందంలో ఉన్న ప్రపంచానికి ఇది షాకింగ్ పరిణామమే. బెల్లియం, నెదర్లాండ్ లు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. జర్మనీ కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోనుంది. లండన్ లో ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించిది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఈ కరోనా కొత్త స్టెయిన్ 70 శాతం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. మరో కీలక విశేషం ఏమిటంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిధిగా రావటానికి అంగీకరించారు. మరి ఈ తరుణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే. మరి కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ ఈ కొత్త కరోనాను నియంత్రిస్తుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఓ వైపు వ్యాక్సిన్ డోస్ తీసుకున్న వారిలో కొంత మందికి ఎలర్జీలు వస్తున్న వ్యవహారం కూడా ఆందోళన కలిగిస్తోంది.